కరోనా టీకా తీసుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్!

 దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, సంఘ్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి ఈరోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిద్దరూ నాగపూర్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో కరోనా టీకా టీకా వేయించుకున్నారు.

కాగా, దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 18,711 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 100 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 14,392 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన‌ట్లు తెలిపింది. 

ఇప్ప‌టి వ‌ర‌కు 1,12,10,799 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మ‌హ‌మ్మారి నుంచి 1,08,68,520 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌ర‌ణాల సంఖ్య 1,57,756కు చేరింది. ప్ర‌స్తుతం క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,84,523. ఇప్ప‌టి వ‌ర‌కు 2,09,22,344 మంది క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

తమిళనాడులో  ఇటీవలి కాలంలో కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించినప్పటికీ మళ్లీ విరుచుకుపడుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాస్కులను వినియోగించకుండా ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతుండడమే ఇందుకు కారణమని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వాపోతున్నారు. జనవరి నుంచి క్రమేణా తగ్గుతూ రోజుకు 500ల కంటే తక్కువ కేసులే నమోదవుతూ వచ్చాయి. 

మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కలకలం రేపుతున్నది.శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 10,187 కరోనా కేసులు, 47 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,08,586కు, మర­ణాల సంఖ్య 52,440కు చేరింది.