
బెంగాల్‌లో నివసించే వారందరూ బెంగాలీలే అని ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి స్పష్టం చేశారు. ఓ బెంగాలీగా తానెంతో గర్వపడతానని, ప్రజలందరూ తన సినిమా డైలాగులను ఇష్టపడతారన్న విషయం తెలుసని పేర్కొన్నారు.
మిథున్ చక్రవర్తి బెంగాల్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి విజయవర్గీయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. తాను మాములు పాము కాదని, కోబ్రానని వ్యాఖ్యానించారు.
తాను దేశానికి ఏదో చేయాలని ముందునుంచీ భావించేవాడినని, అయితే నా కలలు నిజమై, ఇప్పుడు కనిపిస్తున్నాయని పరోక్షంగా మోదీ పాలనను మెచ్చుకున్నారు. బెంగాలీల నుంచి ఎవరైనా దేనినైనా లాగేసుకుంటే, అందరమూ దానిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
తన పేరు మిథున్ చక్రవర్తి అని, ఏది చెబితే అది చేస్తానని మిథున్ తెలిపారు.
More Stories
‘విజిట్ ఇండియా 2023’తో పర్యాటకాభివృద్ధి
కాంగ్రెస్ విద్వేష విధానం బయటపడింది
‘స్పెషల్ బ్లూ జాకెట్’ ధరించిన మోదీ