
కాల్పుల విరమణ ఒప్పందం జరగడం భారత్, పాకిస్తాన్లకే కాదు రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న ప్రజల అతి పెద్ద విజయమని కాశ్మీర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు నియంత్రణ రేఖ, జమ్ముకాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని గతవారం భారత్, పాక్లు ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.
అయితే వచ్చే రెండు నెలల్లో చొరబాటు మార్గాల్లోని మంచు కరగడం ప్రారంభమవుతుందని, రానున్న రోజుల్లో సరిహద్దుల్లో ఇరు సైన్యాలు అతిపెద్ద పరీక్షను ఎదుర్కోవలసి వస్తుందని, మే 24 అర్థరాత్రి మొదటి ఒప్పందం జరిగిన అనంతరం అక్కడ సమీక్ష జరుపుతున్న స్థానిక పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ప్రభావంతో ఇక్కడి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని చెబుతున్నారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన అనంతరం సరిహద్దుల్లో ఒక్క కాల్పుల ఘటన కూడా జరగలేదని పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఫిబ్రవరి 22న భారత డైరెక్టర్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డిజిఎంఒ), లెఫ్టినెంట్ జనరల్ పరంజీత్ సింగ్ సంగా, పాకిస్తాన్కి చెందిన మేజర్ జనరల్ నౌమన్ జంకారియాల మధ్య చర్చలు అనంతరం ఇరు సైన్యాలు కాల్పుల విరమణను ప్రకటించాయి.
ఈ వార్తపై స్థానికులు స్పందిస్తూ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రిస్తామని.. మా పనులు చేసుకుంటామని, జమ్ము సరిహద్దులోని రాజౌరీ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన హజి మొహ్మద్ షఫీ ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో, ఉగ్రవాదులపై కాల్పులు జరిపేందుకు పాకిస్తాన్ సైన్యం తరచూ భారత్ వైపు కాల్పులు జరిపేదని, జమ్ముకాశ్మీర్లోకి చొరబడే ఉగ్రవాదులు, ఆ యా ప్రదేశాల నుండి దృష్టి మరల్చేందుకు ఈ విధంగా కాల్పులు జరిపేవారని పేర్కొన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరిగితే పాక్ ప్రధాని, అక్కడి సైనికాధికారులను ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపారు.
కాగా, సరిహద్దుల్లో పరస్పర ప్రయోజనకరమైన, శాంతి ఒప్పందం జరిగిందని, ఇరు పక్షాలు ఇందుకు అంగీకరించాయని మూడు రోజుల అనంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 2003 నవంబర్న జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం జనవరి 24 అర్థరాత్రి నుండి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ పలుసార్లు సరిహద్దుల వెంబడి కాల్పుల ఘటనలు, మోర్టార్లతో దాడి ఘటనలు జరిగాయి.
ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన అనంతరం 2020లో అధిక ఘటనలు జరిగాయి. గతేడాది అత్యధికంగా 5,133 కాల్పుల ఉల్లంఘన ఘటనలు జరిగాయని, రోజుకి సగటున 14, రెండు గంటలకి ఒక కాల్పుల ఘటన చోటుచేసుకున్నాయని భారత సైన్యం పేర్కొన్నట్లు గత నెల పార్లమెంటులో వెల్లడించారు. గత మూడేళ్లలో సుమారు 341 మంది స్థానికులు ఈ ఘటనల్లో మరణించారు.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం