సమష్ఠి కృషితోనే కరోనా కట్టడి సాధ్యం

సమష్ఠి కృషితోనే కరోనా కట్టడి సాధ్యం

ప్రధాని నరేంద్ర మోదీ  సోమవారం కరోనా టీకా వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన  టీకా తొలి డోసు తీసుకున్నారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను ఆయన కొనియాడారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాను తరమి కొట్టే క్రమంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన పేర్కొన్నారు. 

అర్హులైన ప్రతిఒక్కరు కరోనా టీకా వేయించుకోవాలని ఆయన కోరారు. సమష్ఠి కృషితోనే కరోనా కట్టడి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే దేశీయంగా తయారైన భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను ప్రధాని మోడీ వేయించుకున్నారు. ఈ టీకాను ఆయనకు ఎయిమ్స్ నర్సు నివేదా వేశారు. 

కాగా, దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 16 వేల పైచిలుకు పాజిటివ్‌ కేసులు రికార్డవగా, నేడు 15 వేలకు పడిపోయాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు కోటీ 11 లక్షలకు చేరువయ్యారు. కాగా, గత కొన్ని రోజులుగా 100 లోపే ఉంటున్న కరోనా మరణాలు మళ్లీ వంద దాటాయి.