తుని రైలు దహనం ఘటనలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో సహా, నిందితులకు విజయవాడ రైల్వే కోర్టు షాక్ ఇచ్చింది. మార్చి 3న కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది.
ముద్రగడతో పాటు సమన్లు జారీ అయిన వారిలో మంచాల సాయి సుధాకర్ నాయుడు, మరికొందరు నిందితులు ఉన్నారు. 2016 జనవరి 31న తుని వద్ద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనం జరిగింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం ఆందోళన బాట పట్టిన సమయంలో ఇది జరిగింది.
కాపు ఐక్య గర్జన వేదిక పేరుతో ఆరోజు తునిలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఆ సభ ముగిసిన అనంతరం, సభా ప్రాంగణానికి కొద్ది దూరంలోనే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ తగలబడింది. దీనికి సంబంధించి అప్పట్లో రైల్వే చట్టం సెక్షన్ 146,147,153,174 కింద ముద్రగడతో సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.

More Stories
వచ్చే 50 ఏళ్లకు ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
దేవాలయాలకు మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే
త్వరలో టీటీడీ స్థానిక ఆలయాల్లో దశలవారీ శ్రీవారి సేవ