తమ ప్రభుత్వం లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయనతో లైవ్ లో చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రామ్ చంద్ర రావు సవాల్ చేశారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు చర్చిద్దాం దమ్ముంటే రా అని స్పష్టం చేశారు.
వస్తే తాను ఎమ్మెల్సీగా ఏం చేశానో చెబుతానని వెల్లడించాయిరు. అడ్వకెట్ లకు రూ 100 కోట్లు ఫండ్ రావడానికి తానే కారణమని తెలిపారు. హై కోర్ట్ విభజన చేయించింది కూడా తామేనని చెప్పుకొచ్చారు. పైగా, కరోనా సమయంలో పీపీఈ కిట్స్ ఇచ్చింది తామేనని తేల్చి చెప్పారు.
కేటీఆర్ చెబుతున్నావన్నీ అబద్ధాలేనని హైదరాబాద్-రంగారెడ్
తమ ప్రభుత్వం ఆరేళ్లలో లక్షా 32వేల 799 ఉద్యోగాలు ఇచ్చిందని, ఎవరికైనా అనుమానం వుంటే తాను చర్చకు సిద్దమని కేటీఆర్ చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎక్కడైనా చర్చకు తాను సై అని ప్రకటించారు.
కాగా, ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్దమన్న కేటీఆర్ సవాల్ ను ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. కూడా స్వీకరించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ దగ్గర చర్చకు సిద్ధం అని ప్రకటించారు. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చి కూడా భర్తీ చేసినట్లు చూపించారని మండిపడ్డారు.

More Stories
ప్రజలపై కాంగ్రెస్ అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!