
దేశ తూర్పు అనుకూల పాలసీకి అసోం కేంద్ర బిందువు అవుతుందని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. అసోం సర్వతోముఖాభివృద్ధి క్రమంలోనే దేశ ఈస్ట్ పాలసీ క్రియాశీలకం అవుతుందని తేల్చిచెప్పారు.
దేశానికి భౌగోళిక ప్రాధాన్యత దిశలో అసోం ఉందని, ఇక్కడి ప్రగతి ప్రాతిపదికనే దేశానికి చెందిన ఈస్ట్ పాలసీని మరింత పటిష్టం చేసుకుంటామని వెల్లడించారు. అసోం గణనీయ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ అపారంగా కట్టుబడి ఉన్నారని చెబుతూ ఈ దిశలోనే జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జికా) సహాయక ప్రాజెక్టులు అనేకం అసోంలో ఏర్పాటు అయ్యాయని తెలిపారు.
దేశ అంతర్జాతీయ విధానాలులు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ ఆరంభం అయిన పలు ప్రాజెక్టుల క్రమంలో గ్రహించవచ్చునని విదేశాంగ మంత్రి చెప్పారు. ఈ ప్రాంతపు రాష్ట్రాల అభివృద్థికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ విధానాలు, భాగస్వామ్యాలు అన్ని కూడా ఈశాన్య భారత ప్రగతి కోణంలోనే సాగుతాయని తెలిపారు. జపాన్ రాయబారి సతోషి సుజుకీతో కలిసి గువహతికి వచ్చిన విదేశాంగ మంత్రి జికా సహాయ పథకాల అమలును సుజుకీతో కలిసి సమీక్షించారు.
More Stories
ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నిస్ కన్నుమూత
ఏఐతో డీప్‌ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా
లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా అస్సాంలో నూతన బిల్లు