క‌రోనా వ్యాక్సిన్‌తో 8 నెలలకు పైగా ర‌క్ష‌ణ

ప‌్ర‌పంచ మాన‌వాళిని వ‌ణికించిన కరోనా మ‌హ‌మ్మారి ఆట క‌ట్టించేందుకు శాస్త్ర‌వేత్త‌లు అభివ్రుద్ధి చేసిన వ్యాక్సిన్ల‌తో తర్వాత ఎనిమిది నెలలకు పైగా రక్షణ లభిస్తుందని అఖిల భార‌త వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) డైరెక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా తెలిపారు.
 శాస్త్ర‌వేత్త‌లు ఈ గ‌డువు మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నారని కూడా ఆయన తెలిపారు. కొవిడ్‌-19 కట్టడి కోసం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ బృందంలో గులేరియా స‌భ్యుడిగా ఉన్నారు. వ్యాక్సికేష‌న్‌, యాంటీబాడీల త‌యారీ త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌జ‌లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌ల ద్వారా గులేరియా స‌మాధానం ఇచ్చారు.
 ‘రెండో డోస్‌ తీసుకున్న త‌ర్వాత సుమారు 14 రోజులకు శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఎంత కాలం రక్షణ కల్పిస్తాయనే విషయం కచ్చితంగా వెల్లడి కాలేదు.. కనీసం 8నెలల పాటు కరోనాను నిరోధించగలవని భావిస్తున్నాం’’ అని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 75 లక్షలకు పైగా కరోనా డోసులను పంపిణీ చేసినట్టు ఆయన వివరించారు.
50 ఏండ్ల‌కు పైబడిన వ్యక్తులకు, ఆరోగ్య సమస్యలు ఉన్న 20 ఏళ్లు పైబడిన వారికి కూడా వ‌చ్చేనెల 21వ తేదీ నుంచి టీకాలు అందజేస్తామని గులేరియా ప్రకటించారు.
దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి కాకుండా విదేశాలకు కొవిడ్‌ టీకాను ఎందుకు ఎగుమ‌తి చేయ‌డంపై ర‌ణదీప్ గులేరియా స్పందిస్తూ మన దేశంలో టీకా పంపిణీ పూర్తయినా.. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు వాహకాలుగా మారే అవకాశముందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి కట్టడి అనేది అంతర్జాతీయ కార్యక్రమం అని పేర్కొన్నారు. అన్ని దేశాలు దీనిలో భాగం పంచుకోవటం తప్పనిసరని ఆయన స్ప‌ష్టం చేశారు.