పెట్రోల్, డీజిల్ ధరలను ఆకాశాన్నంటుతున్న తరుణంలో అసోం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై లీటరుకు 5 రూపాయలు తగ్గిస్తూ అక్కడి బీజీపే సర్కారు వాహన దారులకు భారీ ఊరట నిచ్చింది. అలాగే మద్యంపై సుంకాన్ని 25 శాతం తగ్గించినట్లు అసోం ప్రభుత్వం వెల్లడించింది.
సవరించిన ఈ రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుండి అమలులోకి ఆర్థిక మంత్రి హిమంత బిస్వాస్ అసెంబ్లీలో ప్రకటించారు. కోవిడ్-19 విస్తరణ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, మద్యంపై అదనపు సెస్ విధించాం..కానీ ఇప్పుడు, రోగుల సంఖ్య బాగా తగ్గింది.
ఈ నేపథ్యంలో తాజా రేటు కోతను ప్రకటించామని తెలిపారు. దీంతో పెట్రోలుపై లీ టరుకు 5 రూపాయల భారం తగ్గుతుందని, తద్వారా లక్షలాది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
కాగా అసోంలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి-ఏప్రిల్‌లో జరగనున్నాయి, ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోవాలని భారీ కసరత్తు చేస్తోంది.

More Stories
భారత్ కు ఇజ్రాయెల్ లైట్ మెషిన్ గన్స్.. సాంకేతిక బదిలీ
మార్చిలో రూ.2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ముడి చమురు