
లఢాక్లో శాంతి నెలకొనాలంటే, బలగాల ఉపసంహరణ జరగాల్సిందేనని చైనాకు తేల్చిచెప్పినట్టు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. గురువారం ఆయన తూర్పు లఢాక్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు.
లఢాక్లో సరిహద్దును కాపాడుకోవడంలో భారత జవాన్లు శౌర్యాన్ని ప్రదర్శించారని మంత్రి కొనియాడారు. ఈ క్రమంలోనే ఘర్షణలో చైనాపై భారత్ పైచేయి సాధించిందని ఆయన తెలిపారు. తూర్పు లఢాక్ లో అంగుళం భూమిని సైతం చైనాకు వదులుకోమని ఆయన తేల్చి చెప్పారు.
ఈ ఘర్షణలో ఇండియా కోల్పోయింది ఏమీ లేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఇప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని, చర్చలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆయుధ సంపత్తిని భారీగా పెంచింది. ఇండియా కూడా అందుకు దీటుగా స్పందించింది. వ్యూహాత్మక ప్రదేశాల్లో మన ధైర్యవంతులైన జవాన్లు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో మనమే పట్టు సాధించాము. దేశ సమగ్రత కోసం ఎంత వరకైనా వెళ్తామని మన జవాన్లు చాటి చెప్పారు. రెండు వైపులా వాస్తవాధీన రేఖను గౌరవించాలి అని రాజ్నాథ్ అన్నారు.
పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లో బలగాల ఉపసంహరణకు చైనాతో ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. దశలవారీగా రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. తూర్పు లఢాక్ లో ఘర్షణ కారణంగా భారత్ ఏమీ కోల్పోలేదని, ఇంకా పలు సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు.
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆయుధ సంపత్తిని పెంచిందని భారత్ అందుకు ధీటైన సమాధానం ఇచ్చందని ఆయన చెప్పారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో ధైర్యవంతులైన భారత్ జవాన్లు పహారా గాస్తున్నారని ఆయన పేర్కొ్నారు. దేశ సమగ్రత కోసం ఎంతవరకైనా పోరాడుతామని ఆయన తెలిపారు. రెండు వైపుల నుంచి వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
More Stories
ఎట్టకేలకు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించిన ఆఫ్ఘన్ మంత్రి!
`ఆపరేషన్ బ్లూ స్టార్’ పొరపాటు.. ఇందిరను కోల్పోవాల్సి వచ్చింది
భారత్ తో సంబంధం ఎంతో విలువైనదిగా భావిస్తున్న అమెరికా