అమెరికా, బ్రెజిల్‌కు భారత్‌ కొవాగ్జిన్‌

అమెరికా, బ్రెజిల్‌కు భారత్‌ కొవాగ్జిన్‌
భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కొవాగ్జిన్‌’ త్వరలో అమెరికా, బ్రెజిల్‌ ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు రెండు దేశాల్లో ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్టు భారత్‌ బయోటెక్‌ తెలిపింది. 
 
అమెరికాలో కొవాగ్జిన్‌ ఉత్పత్తి, మార్కెటింగ్‌ కోసం ప్రముఖ ఫార్మా సంస్థ ‘ఒక్యుజెన్‌’తో చేతులు కలిపింది. ప్రారంభంలో భారత్‌ బయోటెక్‌ నేరుగా హైదరాబాద్‌ నుంచి కొంతమేర డోసులను పంపనుండగా, ఆ తర్వాత అక్కడే ఉత్పత్తి చేయనున్నది. 
 
ఈ మేరకు ఒక్యుజెన్‌ సంస్థ అనుమతుల కోసం అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)తో చర్చలు జరుపుతున్నది. బ్రెజిల్‌లో కొవాగ్జిన్‌ సరఫరా చేసేందుకు ‘ప్రెసియా మెడికామెంటోస్‌’ సంస్థ ముందుకొచ్చింది. 
 
ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌కు రానున్న కంపెనీ ప్రతినిధులు.. భారత్‌ బయోటెక్‌ ప్లాంట్‌ను సందర్శించడంతోపాటు వ్యాక్సిన్‌ గురించి పూర్తి వివరాలను సేకరించనున్నారు.