
జీఎస్టీ వసూళ్లు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. గత నెల జీఎస్టీ వసూళ్ల ద్వారా రూ.1.19 లక్షల కోట్లు సమకూరాయి. జీఎస్టీ విధానాన్ని అమలు చేసిన తరువాత ఇంత ఆదాయం రావడం ఇదే మొదటిసారి. ఇందులో సీజీఎస్టీ రూ.21,923 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ రూ. 29,014 కోట్లు, ఐజీఎస్టీ రూ. 60,288 కోట్లు ఉంది. .
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సీజీఎస్టీ రూపంలో రూ. 46,454 కోట్లు, ఎస్జీఎస్టీగా రూ. 48,385 కోట్లు సమకూరాయి. జీఎస్టీ వసూళ్లు గత ఐదు నెలలుగా పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటించింది. 2020 జనవరి వసూళ్లతో పోలిస్తే 2021 జీఎస్టీ వసూళ్లు ఎనిమిది శాతం ఎక్కువని వెల్లడించింది. 2020 డిసెంబరులోనూ రూ.1.15 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో సమకూరాయని పేర్కొంది.
గతేడాది ఇదే నెలకు రూ.1.11 లక్షల కోట్లు జిఎస్‌టి కింద వసూలయ్యాయి. దాదాపు 1.2 లక్షల కోట్ల మార్కును తాకిందని, గత నెలలో 1.15 లక్షల కోట్లు వసూలు అయినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపుగా నాలుగు నెలల నుండి జిఎస్‌టి వసూళ్లు లక్ష కోట్లను దాటుతున్నాయి. డిసెంబర్ నెలకు సంబంధించి జనవరి 31 వరకు 90 లక్షల జిఎస్‌టి-3బి రిటర్నులు దాఖలైనట్లు పేర్కొంది.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ