‘ఆత్మనిర్భర భారత్‌’కు అద్దంపట్టిన బడ్జెట్

‘ఆత్మనిర్భర భారత్‌’కు అద్దంపట్టిన బడ్జెట్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో సోమవారంనాడు ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. భారతదేశ దృఢ సంకల్పాన్ని, ఆత్మనిర్భరతను ప్రపంచానికి చాటుతోందని పేర్కొన్నారు.

 స్వయంసమృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవర్చేలా కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. ఆసాధారణ పరిస్థితుల నేపథ్యంలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు.

సమాజంలోని అన్ని వర్గాలకు చేయూత నిచ్చేలా బడ్జెట్ ఉందని, మౌలిక వసతులకు నిర్మలా సీతారామన్ పెద్ద పీట వేశారని ప్రధాని కొనియాడాన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. ఆత్మనిర్భర భారత్‌కు బడ్జెట్ విజిన్‌లా పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై బడ్జెట్ దృష్టి సారించిందని చెప్పారు. ఈ దిశగా అనేక చర్యలు తీసుకున్నామని పేర్కొంటూ రైతులు చాలా సులువుగా రుణాలు తీసుకోగలగుతారని చెప్పారు. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ ఫండ్ సహాయంతో ఏపీఎంసీ మార్కెట్లు పటిష్టమవుతాయని తెలిపారు. రైతులను, గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ రోపిందించినట్లు ప్రధాని చెప్పారు. 

యువతకు కొత్త అవకాశాల కల్పనతో పాటు మానవ వనరులు, మౌలిక వసతుల వృద్ధితో సాంకేతకపరంగా పురోగమించడానికి బడ్జెట్‌ సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయని ఆయనభరోసా వ్యక్తం చేశారు. సామాన్యుడిపై పన్ను భారం ఉంచినట్టు చాలామంది అభిప్రాయపడవచ్చని, అయితే, బడ్జెట్‌  పారదర్శకతపై తాము దృష్టి సారించామని మోదీ పేర్కొన్నారు.

కాగా, ఈసారి బడ్జెట్ ఇలా ఉంటుందని ప్రజలు ఏమాత్రం ఊహించలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే గతంలో తమ ప్రభుత్వం ఐదు మిని బడ్జెట్‌లను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లలోనే కొన్ని ప్యాకేజీలు ప్రకటించామని, ఆత్మనిర్భర భారత్ అందులో భాగమేనని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ సూపర్ బడ్జెట్ అని, ఎంత ప్రశంసించినా తక్కువే అని, అంత బాగుందని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.