కర్నాటక అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కాగా, శాసనమండలిలో చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ సెల్‌ఫోన్‌లో అశ్లీల వెబ్‌సైట్‌లో వీడియోలు చూస్తన్న చిత్రం బహిర్గతమైంది. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. తాను ఆ వీడియోలు చూడలేదని ప్రకాశ్ రాథోడ్ చెప్పారు.
తాను గ్రామీణాభివృద్ధిపై మంత్రితో మాట్లాడుతున్నానని, దానికి సంబంధించిన ప్రశ్నల కోసం సెల్‌ఫోన్‌లో వెతుకుతున్నానని వివరణ ఇచ్చారు. సెల్‌ఫోన్‌లో డేటా నిండిపోవడంతో కొన్ని డిలీట్ చేస్తున్నట్లు రాథోడ్ తెలిపారు. రాథోడ్ చేసిన పనిని బీజేపీ తప్పుపట్టింది. వెంటనే అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.
అయితే కర్నాటకలో అసెంబ్లీ అశ్లీల వీడియోలు చూడడం కొత్తేం కాదు. 2012లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోయారు.

More Stories
నైతిక, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేథస్సు కోసం భారత్
హర్మన్‌ప్రీత్ సేనకు బీసీసీఐ రూ. 51 కోట్ల నజరానా
భారత మహిళల జట్టుకు తొలిసారి వన్డే ప్రపంచకప్ కైవసం