రంగ రంగ వైభవంగా రిపబ్లిక్ డే వేడుకలు 

దేశ 72వ గణతంత్ర వేడుకలు రాజ్‌పథ్‌లో అత్యంత ఘనంగా జరిగాయి.  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌పథ్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, త్రివిద దళాధిపతులు, తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

జాతీయ పతాక ఆవిష్కరణానంతరం త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. 21 గన్ సెల్యూట్లతో రిపబ్లిక్ డే వేడుకల సంబంరం అంబరాన్నంటింది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌‌కు పరేడ్  కమాండర్‌గా లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా సారథ్యం వహించారు. రిపబ్లిక్ డే వేడుకలో బంగ్లాదేశ్ ఆర్మీ తొలిసారి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భారత సైన్యంకు చెందిన టీ-90 భీష్మ యుద్ధ ట్యాంక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.  ప‌రేడ్ సంద‌ర్భంగా టీ-90 భీష్మ‌ను ప్ర‌ద‌ర్శించారు. 54వ రెజిమెంట్‌కు చెందిన‌ కెప్టెన్ క‌ర‌ణ్‌వీర్ సింగ్ భంగూ .. ట్యాంక్‌తో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.  ప‌రేడ్‌లో బంగ్లాదేవ్ ఆర్మీ బ్యాండ్ కూడా పాల్గొన్నది.  లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ అబూ మొహ‌మ్మ‌ద్ షానూర్ షావ‌న్ నేతృత్వంలో ఈ బ్యాండ్ ర్యాలీ తీసింది. తొలిసారి బంగ్లా బ్యాండ్ పాల్గొన్నది. దీంట్లో 122 మంది స‌భ్యులు ఉన్నారు.

బ్ర‌హ్మోస్ మిస్సైల్‌కు చెందిన ఆటోన‌మిస్ లాంచ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు.  కెప్టెన్ ఖ‌మ్రుల్ జ‌మాన్ నేతృత్వంలో బ్ర‌హ్మోస్‌ను ప్ర‌జెంట్ చేశారు.  ఇండియా, ర‌ష్యా దేశాలు సంయుక్తంగా ఈ మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను డెవ‌ల‌ప్ చేశాయి.  400 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను బ్ర‌హ్మోస్ చేధించ‌గ‌ల‌దు. 841 రాకెట్ రెజిమెంట్‌కు చెందిన పినాకా మ‌ల్టీ లాంచ‌ర్ రాకెట్ సిస్ట‌మ్‌ను  ప‌రేడ్‌లో ప్ర‌ద‌ర్శించారు.

కెప్టెన్ విభోర్ గులాటీ ఈ టీమ్‌ను లీడ్ చేశారు.  214 ఎంఎం పినాకా ఎంబీఆర్ఎల్‌.. అడ్వాన్స్‌డ్ రాకెట్ సిస్ట‌మ్‌. ఇది సంపూర్ణంగా ఆటోమెటిక్ లాంచ‌ర్‌.  అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఈ రాకెట్ ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తుంది.

కెప్టెన్ ప్రీతీ చౌద‌రీ ఈ యేటీ ఆర్డీ ప‌రేడ్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. భార‌తీయ సైనిక ద‌ళానికి రిప్ర‌జెంట్ చేసిన ఏకైక మ‌హిళా ఆఫీస‌ర్ ఆమె.  140 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ ప్రీతీ.. ఆర్డీ ప‌రేడ్‌లో చిల్కా వెప‌న్ సిస్ట‌మ్‌కు నేతృత్వం వ‌హించారు. చిల్కా వెప‌న్ సిస్ట‌మ్‌లో అత్యాధునిక రేడార్లు ఉన్నాయి.

 డిజిట‌ల్ ఫైర్ కంట్రోల్ కంప్యూట‌ర్లూ ఉన్నాయి. అన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో శ‌త్రు టార్గెట్ల‌ను చిల్కా వెప‌న్ ధ్వంసం చేయ‌గ‌ల‌దు.  గ్రౌండ్‌పై రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్ల‌ను ట్రాక్ చేసి క‌చ్చితంగా షూట్ చేయ‌గ‌లదు.   

రాముడి చిత్రంతో పాటు హనుమంతుడు సంజీవనిని తీసుకు రావడం, జటాయు-రాముడి సంవాదం తదితర దృశ్యాలను శకటంపై ఆవిష్కరించారు. అయోధ్య దీపోత్సవం ఉట్టిపడేలా మట్టిదీపాలు వెలిగించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన రామాలయం నమూనా శకటం రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

లఢక్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు… ఒక కేంద్ర పాలిత ప్రాతం నుంచి రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న తొలి శకటం క్రెడిట్‌ను కూడా ఈ శకటం సొంతం చేసుకుంది. పరేడ్‌లో లఢక్ శకటం ముందు వెళ్తుండగా, ఇతర రాష్ట్రాల శకటాలు దానిని అనుసరించాయి. లఢక్ సంస్కృతి, మత సామరస్యం, లలిత కళలు, వాస్తుకళ, భాష, మాండలికం, ఆచార వ్యవహారాలు, సంప్రదాయ దుస్తులు, పండుగలు, సాహిత్యం, సంగీత ప్రతిభను చాటుతూ ఈ శకటాన్ని రూపొందించారు.