ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ ఫామ్‌లలో అశ్లీల సన్నివేశాలను సెన్సార్ చేయాల్సిన అవసరం ఉందని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు.
మత మనోభావాలను దెబ్బతీసిందని తాండవ్ వెబ్ సిరీస్ పై రేగిన వివాదంతో దాని నిర్మాతలకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బహుళ ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన నేపథ్యంలో సీఎం చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అశ్లీల కంటెంట్ అందిస్తున్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల వల్ల చిన్నపిల్లలు కూడా ఈ కంటెంట్ వల్ల ప్రభావితమవుతున్నారు. మొబైల్ ఫోన్లలో ఇలాంటి కంటెంట్ చూసిన తర్వాత 12 ఏళ్ల బాలుడు ఇటీవల ఆరేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని సీఎం చౌహాన్ చెప్పారు.
బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.పిల్లలు అశ్లీల కంటెంటును చూసి దీని బారిన పడుతున్నారని, దీన్ని సెన్సార్ చేయాలని సీఎం కోరారు.

More Stories
ఈసీలో ఎస్ఐఆర్ పై `అసమ్మతి’లేదు, `భిన్నాభిప్రాయాలు’ సహజం!
ఐఐటీ బొంబాయి విద్యార్థి ఆత్మహత్య కేసులో సెలవుపై ప్రొఫెసర్ దూల్లా
రెండు రోజుల పాటు కేంద్ర మంత్రుల చింతన్ శిబిర్!