డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అశ్లీలతను సెన్సార్ చేయాలి

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అశ్లీలతను సెన్సార్ చేయాలి
ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ ఫామ్‌లలో అశ్లీల సన్నివేశాలను సెన్సార్ చేయాల్సిన అవసరం ఉందని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు.
 
మత మనోభావాలను దెబ్బతీసిందని తాండవ్  వెబ్ సిరీస్  పై రేగిన వివాదంతో దాని నిర్మాతలకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బహుళ ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన నేపథ్యంలో సీఎం చౌహాన్ ఈ  వ్యాఖ్యలు చేశారు. 
 
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అశ్లీల కంటెంట్ అందిస్తున్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్‌ల వల్ల చిన్నపిల్లలు కూడా ఈ కంటెంట్ వల్ల ప్రభావితమవుతున్నారు. మొబైల్ ఫోన్‌లలో ఇలాంటి కంటెంట్ చూసిన తర్వాత 12 ఏళ్ల బాలుడు ఇటీవల ఆరేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని సీఎం చౌహాన్ చెప్పారు. 
 
బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.పిల్లలు అశ్లీల కంటెంటును చూసి దీని బారిన పడుతున్నారని, దీన్ని సెన్సార్ చేయాలని సీఎం కోరారు.