
అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణం కోసం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌స్వామి ఆశ్రమంలో పలు సంస్థల అధినేతలు విరాళాలు ఇచ్చారు. మెఘా గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి రూ.6కోట్ల విరాళం ఇచ్చారు. మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు రూ.5 కోట్లు, అపర్ణ గ్రూప్ చైర్మన్ రూ.2 కోట్లు అందించారు.
రామమందిర నిర్మాణానికి బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. గ్రీన్‌పార్కు హోటల్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యదర్శి భయ్యాజి జోషికి ఆయన చెక్కును అందజేశారు.
బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కోటి రూపాయల విరాళం చెక్కును శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రతినిధులకు ఆయన అందజేశారు.
More Stories
తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు
కులాంతర వివాహాలు ధర్మ సమ్మతమే
24 నుంచి హైదరాబాద్- బెంగళూరు, విజయవాడ- చెన్నై వందే భారత్