
భారత్ ఇప్పటికే స్వదేశీ ఆయుధాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా అద్భతమైన ఆయుధాలను డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే అనేక ఆయుధాలను అభివృద్ధి చేసింది. ఇప్పుడు తాజాగా మరో అద్భుతమైన మెషీన్ గన్‌ను తయారు చేసింది. అది కూడా కేవలం 4నెల్లోనే దీనిని తయారు చేసింది. పూర్తి దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ గన్ త్వరలో భారత అమ్ముల పొదిలో చేరనుంది.
భారత సైన్యంతో కలసి డీఆర్‌డీవోకు చెందిన పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం ఈ గన్‌ను అభివృద్ధి చేసింది. దేశీయంగా తయారైన తొలి 9ఎంఎం మెషీన్ గన్ ఇదే కావడం విశేషం. దీనికి డీఆర్‌డీవో, భారత ఆర్మీలు ‘అస్మి’అని నామకరణం చేశారు.
అస్మి గన్ పైభాగంలో ఉండే రిసీవర్‌ను విమానాల తయారీలో వాడే అల్యూమినియంతో రూపొందించారు. కింది భాగంలో ఉండే రిసీవర్‌ను కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. ఆర్మీ అధికారుల వ్యక్తిగత ఆయుధాల కేటగిరీలో అస్మి కీలకపాత్ర పోషిస్తుందనేది నిపుణులు భావిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలకు, వీఐపీ రక్షణ విధులు నిర్వర్తించే వారికి కూడా ఈ ఆయుధం ఉపయోగపడుతుందని కేంద్ర రక్షణ శాఖ చెబుతోంది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ గన్ ఒక్కొక్కటీ తయారు చేసేందుకు రూ.50 వేలకంటే ఎక్కువ ఖర్చు కాదని అంచనా వేస్తోంది.
More Stories
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం
మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణలో ఒకరు మృతి
గాజాలో పరిస్థితిపై భారత్ ఆందోళన