జల్ జీవన్ మిషన్ ద్వారా 2.78 కోట్ల ఇళ్లకు నీళ్లు

కేంద్ర ప్రభుత్వం 15 ఆగస్టు, 2019 న ప్రకటించిన జల్ జీవన్ మిషన్ పధకం కింద 278 లక్షల గృహాలకు (హెచ్‌హెచ్) కు పంపు నీటి కనెక్షన్లు అందించారు. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, ప్రస్తుతం దేశంలో 6.01 కోట్ల గ్రామీణ గృహాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 18 జిల్లాలలో అన్ని గృహాలకు కుళాయి కనెక్షన్‌లను అందించారు. ప్రతి ఇంటికి పంపు నీటి సరఫరాను అందించడంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.

ఈ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో మిషన్‌ను సూచించే డాష్‌బోర్డ్ ప్రకారం 2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ గృహానికి ట్యాప్ కనెక్షన్ల ద్వారా క్రమం తప్పకుండా, దీర్ఘకాలిక ప్రాతిపదికన తగిన పరిమాణంలో త్రాగునీటిని అందించే లక్ష్యంతో రాష్ట్రాలతో భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ (జెజెఎం) ను అమలు చేస్తున్నారు.

మిషన్ అమల్లోకి వచ్చిన తరువాత, బేస్‌లైన్ డేటా
ధ్రువీకరణ అభ్యాసం చేపట్టాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. దీని ప్రకారం దేశంలో 19.05 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 3.23 కోట్ల గృహాలకు ఇప్పటికే ట్యాప్ కనెక్షన్లు అందించారు. మిగిలిన 15.81 కోట్ల గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించాల్సి ఉంది.

అందువల్ల, ఆ గృహాలు అన్నింటికీ ట్యాప్ కనెక్షన్లు అందించడమే ఈ మిషన్ లక్ష్యం. ఇప్పటికే అందించిన కనెక్షన్లను కొనసాగిస్తూ నిర్ణీత కాలంలో మొత్తం 16 కోట్ల గృహాలకు అందించే కృషి జరుగుతున్నది. అంటే ప్రతి సంవత్సరం 3.2 కోట్ల గృహాలను కవర్ చేయాల్సి ఉంటుంది. అనగా రోజువారీగా సుమారు .88,000 ట్యాప్ కనెక్షన్లను అందించవలసి ఉంది.

ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని, గ్రామీణ ప్రాంతాల్లో పంపు నీటి కనెక్షన్లు అందించడానికి రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. 2020-21లో, జెజెఎం అమలు కోసం రూ 23,500 కోట్లు కేటాయించారు. ఇది కాకుండా, 2020-21లో, 15 వ ఆర్థిక కమిషన్ ప్రకారం 50 శాతం నిధులను గ్రామీణ స్థానిక సంస్థలకు మంజూరు చేస్తుంది. అనగా రూ. 30,375 కోట్ల టైడ్ గ్రాంట్‌గా నీటి సరఫరా, పారిశుద్ధ్యం కోసం ఉపయోగిస్తారు.

గ్రామాల్లో త్రాగునీటి సరఫరా వ్యవస్థల మంచి ప్రణాళిక, అమలు నిర్వహణ, నిర్వహణలకు ఇది సహాయపడుతుంది. తద్వారా ప్రజలు క్రమం తప్పకుండా, దీర్ఘకాలిక ప్రాతిపదికన త్రాగునీటిని పొందడం కొనసాగిస్థారు. 2024 నాటికి వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు మిషన్ లక్ష్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉన్నాయి.

గోవా ఇప్పటికే అన్ని గృహాలకు పంపు నీటి సరఫరాను అందజేస్తున్నది. 2021 లో బీహార్, పుదుచ్చేరి, తెలంగాణ అన్ని గృహాలకు పంపు నీటి కనెక్షన్‌ను అందించాలని యోచిస్తున్నాయి. అదేవిధంగా, గుజరాత్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, లడఖ్, మేఘాలయ, పంజాబ్, సిక్కింలు సహితం 2022 నాటికి అందించాలని ప్రణాళికలు వేశారు.

అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలు 2023 లో 100 శాతం కవరేజ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశాయి. అస్సాం, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు పశ్చిమ బెంగాల్ 2024 కోసం ప్రణాళికలు తయారు చేశారు. Jal