‘‘వారు ప్రభుత్వాన్ని విశ్వసించరు, సుప్రీంకోర్టును సైతం నమ్మరా? వారు విశ్వసించాలి. చర్చలకు రావాలని చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను’’ అంటూ అభ్యర్ధించారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు జరగకూడదని వారు కోరుకుంటున్నారా? ఎక్కడైనా అమ్ముకునేందుకు స్వేచ్ఛ కల్పించడం సరికాదని భావిస్తున్నారా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
పాత విధానాలు అంత మంచివైతే రైతులు ఇప్పటికీ ఎందుకు పేదరికంలో మగ్గిపోతున్నారు? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఆత్మవలోకనం చేసుకోవాలని చౌదరి కోరారు.
ఈ చట్టాలపై కమిటీని ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కైలాశ్ స్వాగతించారు. ఈ కమిటీ రైతుల నుంచి సలహాలు స్వీకరించి, ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కఠినంగా వ్యవహరించడం వల్ల ప్రయోజనం ఉండదని రైతులకు తెలిపారు. ఈ చట్టాలు సంస్కరణాత్మకమైనవని, వీటికి కోట్లాది మంది రైతులు మద్దతిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

More Stories
కొత్త హరిత ఆర్ధిక వ్యవస్థలో అభివృద్ధి చెందిన దేశాలువెనకడుగు?
అరెస్టైన వైద్యురాలు భారత్లో జైషే మహిళా అధిపతి
ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదు