ఐటీబీపీ ఆధ్వర్యంలో ఛాత్రపూర్లో నడుస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటరైన సర్దాద్ పటేల్ కోవిడ్ సెంటర్లో విదేశాల నుంచి వస్తున్న వ్యక్తులను చేర్చుకొంటున్నారు. కోవిడ్ సెంటర్లో చేరుతున్న పేషెంట్ల సంఖ్య తగ్గడంతో విదేశాల నుంచి వచ్చే రోగులను చేర్చుకోవడానికి కేంద్రం అంగీకరించింది.
600 మంది సిబ్బంది ఉన్న ఈ కేర్ సెంటర్లో 60 మంది రోగులు  ఉన్నారు. దీంతో ఈ కేంద్రంలో దుబాయ్, నెథర్లాండ్, జపాన్, మలేసియా, కెనడా వంటి దేశాల నుంచి వచ్చిన రోగులను చేర్చుకుంటున్నారు.
అయితే కోవిద్ స్ట్రెయిన్కు కేంద్రబిందువైన యూకే నుంచి ఇంతవరకూ ఎవరినీ  చేర్చుకోలేదని చెప్పారు. గతంలో ఢిల్లీ నుంచి వచ్చే కోవిడ్ రోగులను నేరుగా ఇక్కడకి పంపడం, అడ్మిట్ చేసుకోవడం జరిగిందని, గత కొద్ది వారాల నుంచి ఈ కేంద్రానికి వస్తున్న రోగుల సంఖ్య 50 నుంచి 60కి తగ్గిపోయిందని తెలిపారు.
ఢిల్లీలో కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో పిలిపించిన సిబ్బంది సంఖ్యను ప్రస్తుతం కుదించాలని అనుకుంటున్నట్టు కూడా తెలిపారు. ప్రస్తుతం రోగుల కంటే సిబ్బందే ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు.
                            
                        
	                    
More Stories
లక్నో వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు
భారత్లోనే నిఫా నిరోధక ‘యాంటీబాడీస్’ తయారీ
ఢిల్లీలో వాయు కాలుష్యం.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు