బిజెపిలోకి  జీవితారాజశేఖర్

బిజెపిలోకి  జీవితారాజశేఖర్

సినీ నటి జీవితారాజశేఖర్ వైసీపీకి ఝలక్ ఇచ్చారు. వైసీపీలో చేరి జగన్‌ను విమర్శించి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి  2019 ఎన్నికల ముందు జగన్‌ సమక్షంలో మళ్లీ వైసీపీ కండువా కప్పుకున్న సినీ నటి జీవితారాజశేఖర్ తాజాగా బీజేపీలో చేరారు. 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు.  ఈ సందర్భంలో ఆసక్తికర  గ్రేటర్‌కు చెందిన కొందరు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.  రాజశేఖర్ ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఆయన ఈ సందర్భంలో జీవిత పక్కన లేరని తెలిసింది. జీవితారాజశేఖర్ గతంలోనూ బీజేపీలో చేరి కొన్నాళ్లు ఆ పార్టీలో  కొనసాగిన విషయం విదితమే.

కాగా, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు బండి సంజయ్‌ సమక్షంలో సోమవారం బీజేపీలో చేరారు. ప్రముఖ ప్రజాగాయకుడు, కవి దరువు ఎల్లన్న, కామారెడ్డి పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు ఎంజీ వేణుగోపాల్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మోతే కృష్ణగౌడ్‌, డాక్టర్‌ సిద్ధరాములు, జూలూరి సుధాకర్‌, పుల్లూరి సతీ్‌ష, పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, వార్డుసభ్యులు, ఎల్బీనగర్‌ నియోజకవర్గానికి చెందిన సురేందర్‌ పుజారీ, ఆయన అనుచరులు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కమల దళంలో చేరారు. నారాయణఖేడ్‌ నుంచి సంగమేశ్వరరెడ్డి, నాగార్జునసాగర్‌ నుంచి పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.