వరుసగా మూడో నెలలోనూ భారతదేశంలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) నిధుల ప్రవాహం కొనసాగించారు. డిసెంబర్‌లో ఎఫ్‌పిఐ పెట్టుబడులు రూ.68,558 కోట్లు వచ్చాయి. ఈక్విటీ సెగ్మెంట్‌లో ఇదే అత్యధిక పెట్టుబడిగా నిలిచింది. ఈమేరకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ పట్ల విదేశీ పెట్టుబడిదారులు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. నవంబర్‌లో ఈక్విటీ సగ్మెంట్‌లోకి రూ.60,358 కోట్లు రాగా, ఇది రెండో అత్యధిక పెట్టుబడిగా నిలిచింది. డిపాజిటరీ డేటా ప్రకారం, 2020 డిసెంబర్ నెలలో విదేశీ పెట్టుబడిదారులు ఈక్విటీలో రూ.62,016 కోట్లు, డెబిట్ మార్కెట్లోకి రూ.6,542 కోట్లు వచ్చింది.
గత నెలలో మొత్తం నికర పెట్టుబడి రూ.68,558 కోట్లు వచ్చింది. ఇంతకుముందు అక్టోబర్ నెలలో ఎఫ్‌పిఐ పెట్టుబడి రూ.22,033 కోట్లు, నవంబర్‌లో రూ.62,951 కోట్లు వచ్చింది.
గ్రో సహ వ్యవస్థాపకుడు, సిఒఒ హర్ష జైన్ మాట్లాడుతూ, విదేశీ పెట్టుబడులు బ్లూచిప్ కంపెనీల్లోకే కాకుండా ఇతర సంస్థల్లోకి కనిపిస్తున్నాయని, స్మాల్, మిడ్‌క్యాప్‌లు కూడా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని, దీంతో ఇవి హై వాల్యుయేషన్‌కు చేరాయని పేర్కొన్నారు.
విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండడంతో ఇది మార్కెట్ల ర్యాలీకి దారితీస్తుందని, ‘ఇలాంటిది ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు’ అని ఆయన చెప్పారు. వాక్సీన్ సక్సెస్ ఆర్థిక వ్యవస్థలో మరింత విశ్వాసాన్ని నింపనుందని, 2021లో ఈ ర్యాలీ కొనసాగవచ్చని తెలిపారు.
More Stories
నిషేధానికి ముందే అమెరికాలో టిక్ టాక్ నిలిపివేత
కరోనా తర్వాత కంగనాకు అతిపెద్ద ఓపెనింగ్ ‘ఎమర్జెన్సీ’
బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయం పన్ను బిల్లు