జీఎస్‌టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలో సరి కొత్త రికార్డు నమోదైంది. 2020 డిసెంబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు 1.15 లక్షల కోట్లతో ‘ఆల్‌టైమ్ హై’ని అందుకున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 
 
గత 21 నెలల్లో నెలవారీ వసూళ్లలో డిసెంబర్ మాసం అత్యధిక వృద్ధిని సాధించిందని పేర్కొంది. కరోనా నుంచి వేగంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, జీఎస్‌టీ ఎగవేతదారులు, ఫేక్ బిల్లులతో పాటు అనేక సిస్టమిక్ మార్పులు ఇటీవల ప్రవేశపెట్టడం వంటివి జీఎస్‌టీ వసూళ్ల పెరుగుదలకు కారణమని తెలిపింది. 
 
నవంబర్ నుంచి డిసెంబర్ 31 వరకూ ఫైల్ అయిన జీఎస్‌టీఆర్-3బీ రిటర్న్‌లు 87 లక్షలని పేర్కొంది.  కాగా, దేశీయ లావాదేవీల‌పై వ‌చ్చిన ఆదాయాల కంటే వ‌స్తువుల దిగుమ‌తి వ‌ల్ల వ‌చ్చిన ఆదాయం 27 శాతం ఎక్కువ‌గా ఉంది. అయితే, ఒకే నెల‌లో జీఎస్టీ రూ.ల‌క్ష కోట్లు దాట‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి కావడం విశేషం. 2019 డిసెంబర్‌ నెలతో పోలిస్తే 2020 డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 12 శాతం అధికంగా నమోదు అయ్యాయి.