అయోధ్యలో రామ మందిరం నిర్మించే స్థలంలో భూమి కింద సరయూ నది నీటి ప్రవాహం ఉన్నట్లు గుర్తించడంతో ఆలయ పునాదులు మరింత బలంగా ఉండేందుకు మెరుగైన నమూనాలను సూచించాని ఐఐటిలను రామ మందిర ట్రస్టు కోరింది.
ప్రధానమంత్రి మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి, ప్రస్తు రామ మందిర కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అధ్యక్షతన ఆలయ కమిటీ మంగళవారం సమావేశమై ఈ విషయమై చర్చించినట్లు వర్గాలు తెలిపాయి.
ఆలయాన్ని నిర్మించే స్థలంలో భూమి కింద సరయూ నదికి చెందిన కాలువ ప్రవహిస్తున్న దృష్టా ప్రస్తుతం ఆమోదించిన పునాదుల నమూనా ఆమోదయోగ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది.
ఆలయానికి మరింత బలమైన పునాదులు వేసేందుకు వీలుగా మరో నమూనాను సూచించాలని దేశంలోని ఐఐటిలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోరినట్లు వర్గాలు తెలిపాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని 2023 కల్లా పూర్తిచేయాలని ట్రస్టు లక్షం పెట్టుకుంది.

More Stories
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు
సంతాప తీర్మానంలో విమర్శలపై బిజెపి అభ్యంతరం