
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్, ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్ బిక్రీవాల్ ను ఢిల్లీ స్పెషల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.బిక్రీవాల్ అరెస్టుతో ఇతను పలు హత్య కేసుల్లో నిందితుడని తేలింది.
పంజాబ్ రాష్ట్రంలో జరిగిన పలు హత్యల్లో ఇతనికి సంబంధాలున్నాయని తేలింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన శౌర్యచక్ర విజేత బల్వీందర్ సంధును హతమార్చారని వెల్లడైంది.
పాక్ ఐఎస్ఐ ఆదేశాలతోనే సంధును చంపడానికి ఉగ్రవాది బిక్రీవాల్ ను వినియోగించారని దర్యాప్తులో తేలింది. బిక్రివాల్ 2016లో పంజాబ్ లోని నభా జైలును బ్రేక్ చేసి దుబాయ్ పారిపోయాడు.
దుబాయ్ దేశంలోని బిక్రివాల్ నివాసంపై గతంలో భారత అధికారులు దాడి చేశారు. దుబాయ్ నుంచి వస్తుండగా బిక్రివాల్ ను పోలీసులు పట్టుకున్నారు.
More Stories
సిక్కింని ముంచెత్తిన వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
గంట వ్యవధిలో నేపాల్ నుండి నాలుగు భూకంపాలు
41 మంది కెనడా దౌత్యవేత్తలకు దేశం వదిలి వెళ్ళమని ఆదేశం