
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు శుక్రవారం వేకువజామున శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెర్చుకోనున్నాయి. ఈ ఏడాది ఏట 10రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని టీటీడీ కలిస్తోంది.
రేపు వేకువజామున 12: 05 గంటలకు ఆలయాన్ని అర్చకులు తెరవనున్నారు. ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 4గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు టీటీడీ దర్శనాన్ని ప్రారంభించునుంది, ఉదయం 8గంటల నుంచి ప్రత్యేక, సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.
జనవరి 3 అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపడనున్నాయి. 10రోజుల్లో దాదాపు 4లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 9గంటలకు స్వర్ణరధంపై శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.
ద్వాదశిని పురస్కరించుకొని ఎల్లుండి వరాహ పుష్కరిణిలో చక్రతాళ్వార్‌కు చక్రస్నానాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. దర్శన టోకెన్లు ఉన్న వారిని మాత్రమే టీటీడీ తిరుమలకు అనుమతించనుంది.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతి వాసులకు టీటీడీ వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్‌ను జారీ చేసింది. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎం.ఆర్. పల్లె మార్కెట్, రామానాయుడు మున్సిపల్ పాఠశాల, మున్సిపల్ ఆఫీసుల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ ల్లో టోకెన్లనుు జారీ చేసింది.
కాగా ఊహించిన దానికంటే రద్దీ తక్కువగానే కనిపించింది. రాత్రి రెండు గంటల నుంచి టీటీడీ టోకెన్స్ జారీని మొదలు పెట్టింది. ఉచిత దర్శనంతో పాటు ఒక లడ్డు ఉచితంగా పొందేలా టోకెన్లను జారీ చేసింది. రోజుకు పది వేలు వంతున, లక్ష టోకెన్లను.. ఈ పది రోజులవి మొదట వచ్చిన వారికి మొదటగా జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ పొందారు. లక్ష మంది స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనం శుభపరిణామమని ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ