పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత ఒక్కో రైతుల ఖాతాలో రూ.2000 చొప్పున జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందుకు అవసరమయ్యే నిధులను ఈ నెల 25న ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయనున్నారు.
దేశంలో మొత్తం 9 కోట్ల మందికి పైగా ఉన్న రైతులకు మరో విడత ఆర్థిక చేయూత అందించడం కోసం రూ.18,000 కోట్లకుపైగా నిధులను ప్రధాని నిధులను విడుదల చేయనున్నారు. ఈ నిధుల విడుదల కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశంలోని ఆరు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించనున్నారు.
ఈ సందర్భంగా రైతులు తమ సాధకబాదకాలను ప్రధానితో పంచుకోనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సహా, రైతు సంక్షేమం కోసం కేంద్రం చేపట్టిన ఇతర చర్యలపై రైతులు తమ అనుభవాలను ప్రధానికి చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా పాల్గొననున్నారు.
దేశంలోని రైతులందరికీ ఆర్థిక సాయం అందించడం కోసం ప్రధాని నరేంద్రమోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి ఏడాది ఒక్కో రైతు ఖాతాలో ఆర్థిక సాయంగా రూ.6,000 చొప్పున జమ చేస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సాయాన్ని ఒకేసారి కాకుండా ఏడాదిలో మూడు విడుతల్లో రూ.2,000 చొప్పున ఇస్తున్నారు.

More Stories
షట్డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు