సూపర్‌స్టార్ రజనీకాంత్ గత వారమే చేరిన అన్నాత్తే మూవీ షూటింగ్‌లో కరోనా కలకలం చెలరేగింది. ఈ సినిమా యూనిట్‌లో 8 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ముందస్తు జాగ్రత్తగా రజనీ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.
లాక్‌డౌన్, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫిల్మ్ షూటింగ్ కొన్ని నెలల పాటు ఆగిపోయింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో డిసెంబర్ 14న అన్నాత్తే షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ మూవీకి సిరుత్తై సివ దర్శకత్వం వహిస్తుండగా నయనతార, కీర్తీ సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా అన్నాత్తే మూవీ సిబ్బందికి నిర్వహించిన టెస్టుల్లో 8 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో రజనీతో సహా సినీ యూనిట్ మొత్తం రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు.
రజనీకాంత్ హోం ఐసోలేషన్ లో ఉండగా, నయనతార, కీర్తిసురేశ్, ఇతర నటీనటులు క్వారంటైన్ లో ఉన్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సూరి, నయనతార, కీర్తిసురేశ్, ఖుష్బూ, మీనా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
రజనీకాంత్ రాజకీయ పార్టీ ఆవిర్బావం నేపథ్యంలో తొందరగా పూర్తి చేయాలని భావించి రోజుకు 14 గంటలు షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే హఠాత్తుగా ఇలా కరోనా కేసులు బయటకు రావడంతో షూటింగ్ నిలిచిపోయింది.

More Stories
హైదరాబాద్‌పై కాంగ్రెస్ మార్క్ దోపిడీ క్యూర్ చట్టం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లపై బెదిరింపులు, బీఎల్ఓలపై వత్తిళ్లు