బౌద్ధ సాహిత్యానికి ఓ గ్రంథాలయం   

బౌద్ధ సాహిత్యానికి ఓ గ్రంథాలయం   

అపురూపమైన బౌద్ధ సాహిత్యానికి ఓ గ్రంథాలయం ఉంటే బాగుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. తద్వారా కొత్తరకమైన ఆవిష్కరణలన్నీ అభివృద్ధికి బాటలు వేస్తాయని చెప్పారు. ‘‘బౌద్ధ సాహిత్యానికి, గ్రంథాలకు ఓ గ్రంథాలయం ఉంటే బాగుంటుంది. అదీ భారత్‌లో ఉంటే మరింత బాగుంటుంది. వాటికి అవసరమైన సదుపాలయన్నీ ప్రభుత్వం పక్షాన కల్పిస్తాం” అంటూ హామీ ఇచ్చారు.

‘ఇండో- జపాన్ సంవాద్ కాన్ఫరెన్స్’ సమావేశంలో   మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న బౌద్ధ సాహిత్యం మొత్తాన్ని ఒకచోట చేర్చి, వాటికి డిజిటల్ రూపం ఇచ్చి, వివిధ భాషల్లోకి అనువదించి బౌద్ధులకు, బౌద్ధ భిక్షువులకు అందుబాటులో ఉంచితే చాలా బాగుంటుందని మోదీ సూచించారు. 
ఈ గ్రంథాలయం కేవలం సాహిత్యానికే కాదు పరిశోధన, చర్చలకు వేదికగా ఉంటుందని కొనియాడారు. ‘సమాజాలు, మానవులు, ప్రకృతి మధ్య నిజమైన సంవాదం’ అని ఆయన పేర్కొన్నారు. గౌతమ బుద్ధుడి బోధనలతో ప్రపంచ సవాళ్లను అధిగమించవచ్చని ప్రధాని పేరొన్నారు. మన పరిసరాలను సామరస్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
 
శత్రుత్వం శాంతికి బాటలు వేయదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విధానాల్లో కచ్చితంగా మానవత్వాన్ని జోడించుకోవాలని సూచిస్తూ ప్రకృతితో, సాటి మానవులతో సామరస్యంగా జీవించాలని మోదీ ఉద్బోధించారు.  
 
‘‘సామ్రాజ్యవాదం నుంచి ప్రపంచ యుద్ధం వరకు, ఆయుధ పోటీ నుంచి అంతరిక్షం వరకూ…. ఒకరినొకరు అధిగమించి, దూసుకెళ్లడంలో మునిగిపోయాం. బుద్ధుడు ప్రవచించినట్లు మనం శత్రుత్వం నుంచి సాధికారిత వైపు వెళ్లాలి. ఆయా దేశాల అభివృద్ధి మానవత్వం అన్న స్వభావ ఆధారంగా ముందుకు కదలాలి” అంటూ ప్రధాని చెప్పారు.  
వృద్ధి సరళి మానవ కేంద్రిత విధానాన్ని అనుసరించాలని పేర్కొంటూ   ప్రపంచ వృద్ధి చర్చలు కేవలం కొద్ది మధ్య మాత్రమే జరుగరాదని, ఈ అజెండా మరింత విస్తృతం కావాలని ప్రధాని  స్పష్టం చేశారు. ఎదుగుదల నమూనాలు మానవ కేంద్రిత విధానాన్ని అనుసరించాలని చెప్పారు.