నీరవ్‌మోడీ సోదరుడుపై అమెరికాలో కేస్    

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్‌మోడీ సోదరుడు నేహాల్‌ మోడీపై కూడా అమెరికాలో అదే తరహా కేసు నమోదైంది. అమెరికా కరెన్సీలో ఒక మిలియన్‌ డాలర్ల విలువైన వజ్రాలను దొంగతనం చేసినట్లు అక్కడి సిబిఐ కేసు నమోదు చేసింది. 
 
ఆంటెర్వర్‌కు చెందిన నిహాల్‌ మోడీ, క్రెడిట్‌ నిబంధనలను అనుసరించి అమెరికాలోని ఎల్‌ఎల్‌డి డైమండ్స్‌ సంస్థ నుండి 2.6 మిలియన్ల విలువైన వజ్రాలను కొనుగోలు చేశారని, అనంతరం వాటిని సొంత ప్రయోజనాల కోసం నగదుగా మార్చుకున్నారని మన్హట్టన్‌ జిల్లా అటార్నీ జనరల్‌ సైవాన్స్‌ జూనియర్‌ డిసెంబర్‌ 18న ఒక ప్రకటనలో తెలిపారు. 
 
”వజ్రాలు శాశ్వతంగా ఉంటాయని, అయితే ఈవిధంగా మోసానికి పాల్పడటం సరికాదని, ఇప్పుడు న్యూయార్క్‌ సుప్రీంకోర్టు నుండి విచారణను ఎదుర్కోవాల్సిందే” అని ఆయన అన్నారు. తాను కాస్ట్‌కో హోల్‌సేల్‌ కార్పోరేషన్‌ భాగస్వామ్యంతోనే ఉన్నానంటూ .. 8లక్షల డాలర్ల విలువైన వజ్రాలను కోరినట్లు ఎల్‌ఎల్‌డిని సంప్రదించారు. క్రెడిట్‌ మీద ఎల్‌ఎల్‌డి నుండి వజ్రాలను కొనుగోలు చేశాడు. అనంతరం రుణం కోసం ఆ వజ్రాలను తాకట్టు పెట్టారని ఆ ప్రకటన తెలిపింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుండి 200 కోట్ల మేరకు మోసానికి పాల్పడినట్లు సిబిఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన విదేశాలకు పారిపోయారు. 
ఈ కేసులో సిబిఐ నేహాల్‌మోడీని 27వ నిందితుడిగా పేర్కొంది. పిఎన్‌బి మోసానికి సంబంధించి దుబారులో సాక్ష్యాలను నాశనం చేసినట్లు ఆయనపై అభియోగం నమోదు చేసింది.