
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీల(ఎఎన్‌బిపి) కింద బ్యాంకులు మైక్రో క్రెడిట్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎంఎంఇ) కింద సుమారు 81 లక్షల ఖాతాలకు రూ.3 లక్షల కోట్లకు కేటాయించగా, వీటికి రూ.2,05,563 కోట్ల రుణం మంజూరు చేశారు. మూడు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీల కింద వివిధ పథకాల పురోగతిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమీక్షించారు. డిసెంబర్ 4 వరకు 40 లక్షల ఎంఎస్‌ఎంఇ ఖాతాలకు రూ.1,58,626 కోట్ల రుణాలు మంజూరు చేశారు.
గత నెలలో ప్యాకేజీ 3.0ను ప్రకటించిన ఆర్థిక మంత్రి ఇసిఎల్‌జిఎస్ 1.0 కింద రూ.2.55 లక్షల కోట్ల రుణం మంజూరు చేయగా, దీనిలో రూ .1.52 లక్షల కోట్ల రుణం ఇచ్చారు. అనంతరం ఇసిఎల్‌జిఎస్ పథకాన్ని 26 ఒత్తిడి రంగాలకు, ఇసిఎల్‌జిఎస్ 2.0 కింద ఆరోగ్య సంరక్షణ రంగాన్ని నవంబర్ 12న ప్రకటించిన ప్యాకేజీకి కింద విస్తరించారు.
ఇసిఎల్‌జిఎస్ 2.0 ద్వారా అందించిన రుణం ఐదేళ్ల కాలానికి ఉంటుంది. ప్రధాన మొత్తాన్ని చెల్లించడానికి 12 నెలల తగ్గింపు ఉండగా, మొత్తం పథకం 2021 మార్చి 31 వరకు ఉంటుంది.
ఇతర పథకాల పురోగతిపై, రూ.1,500 కోట్ల రూపాయల ముద్ర-శిషు రుణం కింద రూ. 775 కోట్లను నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి)కు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద 1.69 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. 2020 డిసెంబర్ 4 వరకు వారికి రూ.1.54 లక్షల కోట్ల రుణ పరిమితి మంజూరు చేశారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
గిరిజనుల కోసం డిజిటల్ వేదిక “ఆది సంస్కృతి” బీటా వెర్షన్