అస్సాం శాసన సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్న బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకుంది. 46 స్థానాలున్న ఈ కౌన్సిల్‌లో గతంలో బీజేపీకి కేవలం ఒక స్థానం మాత్రమే ఉండేది, తాజా ఎన్నికల్లో 9 స్థానాలను కైవసం చేసుకుంది.
బీటీసీ ఎన్నికలు ఈ నెల 7, 10 తేదీల్లో జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలను శనివారం ప్రకటించారు. బీటీసీలో 46 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఆరుగురిని నామినేట్ చేస్తారు. 40 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 9 స్థానాలను దక్కించుకుంది.
సుమారు 17 ఏళ్లపాటు బీటీసీని పరిపాలించిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) 17 స్థానాలను దక్కించుకుంది. 2015లో ఈ పార్టీకి 20 మంది సభ్యులు ఉండేవారు. బీటీసీని పరిపాలించేందుకు కనీసం 21 మంది మద్దతు అవసరం.
ఈ నేపథ్యంలో 20 స్థానాల్లో గెలిచిన బీపీఎఫ్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2015 ఎన్నికల్లో బీపీఎఫ్, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. కానీ ఈసారి బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. 2021లో జరిగే అస్సాం శాసన సభ ఎన్నికల్లో కూడా బీపీఎఫ్‌తో పొత్తు ఉండబోదని బీజేపీ వర్గాలు తెలిపాయి.

More Stories
విదేశాల నుంచి పలువురు కాంగ్రెస్ నేతల ఎక్స్ ఖాతాలు
అయోధ్యలో ధ్వజారోహణంపై పాక్ అవాకులు
కొత్త కార్మిక కోడ్లు ఉద్యోగులు, యజమానులిద్దరికీ ప్రయోజనం