ఆర్టిక్ 370 ఒక ముగిసిపోయిన అంశమని, ఎవరెన్ని చెప్పినా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 మళ్లీ అమల్లోకి రావడం ఎప్పటికీ సాధ్యంకాదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్రు స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, మొహబూబా ముఫ్తీ 370 ఆర్టికల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా స్పందించారు.
కశ్మీర్‌లోని బుద్గాం జిల్లా పర్యటించిన ఆయన ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు ఫరూఖ్ అబ్దుల్లా చైనా సహాయం తీసుకోనైనా కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని అనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కీలక నేత మెహబూబా ముఫ్తీ ఏమో మనకు ఉగ్రవాదం తప్పితే ఎలాంటి సాయమూ చేయని పాకిస్థాన్ సహాయం తీసుకుంటాను అనడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
?ఎలాగైనా సరే ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తాం అని వాళ్లు చెప్తున్నారు. కానీ నేను చెప్పేదొక్కటే.. ఆ చట్టం పోయిందంతే, మళ్లీ తిరిగి రావడం జరగదని స్పష్టం చేశారు” అని తేల్చి చెప్పారు.

More Stories
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు
కుటుంభం కోసం కాదు.. ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేశా!
కేరళలో ముస్లింలకు 10 శాతం, క్రిస్టియన్లకు 6 శాతం రిజర్వేషన్లు