
సీనీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఈ వైరస్ మహమ్మారి వల్ల పలువురు ప్రముఖులు కన్నుమూయగా, మరి కొందరు క్షేమంగా కొలుకున్నారు.
తాజాగా ప్రముఖ తమిళ హీరో శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన భార్య రాధిక ట్విట్టర్ ద్వారా తెలియ చేశారు. ఈరోజు “శరత్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది” అని ఆమె తెలిపారు.
అయితే ఆయనకు ఎటువంటి లక్షణాలూ కనిపించలేదు కానీ ముందు జాగ్రత్తగా ఆయన మంచి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తా అని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు.
డాక్టర్ల సలహా మేరకు 14 రోజులు ఇంట్లో ఉంటే సరిపోతుందని, ఎవరూ దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని ఆమె స్పష్టం చేశారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్