
టీఆర్పీ కేసులో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి విచారణపై స్టే కోరుతూ అర్నాబ్ కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
ప్రకటన కోసం కొన్ని ఛానెళ్లు టీఆర్పీ గణాంకాలను రిగ్గింగ్ చేస్తున్నాయంటూ హన్సా రీసెర్చ్ గ్రూప్ ద్వారా రేటింగ్ ఏజెన్సీ బార్క్ ఇచ్చిన ఫిర్యాదుతో టీఆర్పీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అర్నాబ్ ఎడిటర్‌గా ఉన్న రిపబ్లిక్ టీవీపై కూడా కేసు నమోదైంది.
ప్రత్యేకించి పలానా ఛానెల్ మాత్రమే చూడాలంటూ వ్యూయర్షిప్ డేటా మీటర్లు ఉన్న కుటుంబాలకు లంచాలు ఇస్తున్నట్టు బార్క్ ఆరోపించింది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కోసం రిపబ్లిక్ టీవీతో పాటు పలు ఛానల్స్ టీఆర్పీ రేటింగ్‌ను తారుమారు చేసినట్టు ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
More Stories
జగన్నాథుడి ఆలయ శిఖరంపై ముడిపడిన జెండాలు
ఓటుకు ఆధార్ లింక్‌పై 18న ఈసీ భేటీ
అమృత్‌సర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి