ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో ముఖ్యమంత్రిని పోలుస్తూ `ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి’ అంటూ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ సీఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వాఖ్యలు చేశారు. జగన్‌కు ప్రజల కష్టాలు తెలియడం లేదని విమర్శించారు.
పేదల ఇళ్ల నిర్మాణ జాప్యాన్ని నిరసిస్తూ విశాఖలో బీజేపీ నిరసనకు దిగింది. బుధవారం తాటిచెట్లపాలెం, ఏఎస్ఆర్ నగర్ కాలనీలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు, నగర బీజేపీ నేతలు హాజరయ్యారు.
హామీ ఇచ్చిన ప్రకారం తక్షణమే పేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారని, కానీ రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారిపోవచ్చని యెద్దేవా చేశారు.
ఉపముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే ఏపీకి మొట్టమొదటి మహిళా సీఎంని చేసి జగన్ చరిత్ర సృష్టించాలని హితవు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని… అక్రమాలు జరిగినందున ఏకగ్రీవాలను రద్దు చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.

More Stories
దుర్గగుడి అభివృద్ధికి త్వరితగతిన మాస్టర్‌ప్లాన్
జిఎస్టి ఆదాయం తగ్గడంపై ఏపీ ఆర్థికశాఖ ఆందోళన
మహిళా క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్1 ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు