అధికార దుర్వినియోగానికి నిరసనగా బీజేపీ దీక్ష

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి నిరసనగా బీజేపీ  నాయకులు పవాస దీక్ష చేపట్టారు. బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ డా కె లక్ష్మణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలో పార్టీ సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ కు కొన్ని గంటల ముందు అధికార పార్టీ నాయకులు పోలీసులను పెట్టుకుని విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ గాంధేయ మార్గంలో దీక్ష చేపట్టినట్లు బీజేపీ నేతలు ప్రకటించారు.

గ్రేటర్ ఎన్నికలను ప్రశాంతంగా స్వేచ్చగా జరపాల్సిన ఎన్నికల కమిషన్ గులాబీ కండువా కప్పుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న దుబ్బాకలో బీజేపీ గెలవడంతో జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే గ్రేటర్ ఎన్నికలను ఆదర బాదరగా ఎన్నికలు నిర్వహిస్తోందన్నారని మండిపడ్డారు. 

ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ కీ తొత్తుగా మారిందని,  గులాబీ కండువా కప్పుకున్నట్లు కుట్ర పూరితంగా వ్యవరిస్తోందని ఆయన ఆరోపించారు. తండ్రీ కొడుకులు అధికార దుర్వినియోగం తో గెలవాలని చూస్తున్నారని ధ్వజమెత్తుతూ అయితే  ప్రజలు మాత్రం అన్ని విషయాలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. 

ఎన్నికల్లో టీఆర్ఎస్ తీరును వ్యతిరేకిస్తూ చేపట్టిన దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. అధికార యంత్రాంగం మొత్తం టీఆర్ఎస్ కు తొత్తులుగా మారారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు.  మైలార్ దేవ్ పల్లి లో ఎమ్మెల్యే  నే తన అనుచరులు తో  బీజేపీ కార్యకర్తల పై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. 

నిన్న రాత్రి  నెక్లెస్ రోడ్డు లో టీ తాగి వెళ్తున్న సంజయ్ పై దాడికి ప్రయత్నాలు చేశారని, అంత జరుగుతున్నా అక్కడ  ఒక్కరిద్దరు పోలీసులు తప్ప ఎలాంటి పోలీస్ ఫోర్స్ లేదని ఆమె మండిపడ్డారు. సంజయ్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని ఆమె ఆరోపించారు.

కాగా, . బంజారాహిల్స్‌ డివిజన్‌లో బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాషాయ మాస్క్ లు ధరించిన పోలింగ్ ఏజెంట్లను, ఓటర్లను సైతం పోలింగ్ సిబ్బంది అడ్డుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాషాయ మాస్క్‎లు ధరిస్తే వారికి ఏంటీ ఇబ్బందంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్త పరిచారు. పోలింగ్‌ సిబ్బంది ఎందుకు లోపలికి అనుమతించడం లేదంటూ బీజేపీ కార్యకర్తలు పోలింగ్ ముందు ఆందోళన చేస్తున్నారు. 
 
మరోవంక,  ఆర్కేపురంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటర్ స్లిప్పులు ఇచ్చే చోట టీఆర్ఎస్ నేతలు బ్యానర్ పెట్టి ప్రచారం చేయడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆర్కేపురం పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.   
 
ఎల్బీ నగర్ లోని ఆర్కే పురం డివిజన్ లో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ వాళ్లు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ ఆందోళన చేశారు.టీఆర్ఎస్ నేత విక్రమ్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని అంటూ  విక్రమ్ రెడ్డిని బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపలాట జరిగింది.