
ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 30న ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 30న స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్ని రోజులు సభను నిర్వహించాలి. అలాగే అసెంబ్లీ సమావేశాల అజెండాను స్పీకర్ ఖరారు చేయనున్నారు.
మరోవంక, రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోయే బిల్లులపై చర్చిస్తారు.
అంతేగాకుండా రాష్ట్రంలో నివర్ తుఫాన్, పంట నష్టం అంచనాలపై సీఎంకు మంత్రులు, అధికారులు వివరిస్తారు. ఈ భేటీలో స్థానిక ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లపై సీఎం జగన్ మంత్రులతో చర్చిస్తారు.
More Stories
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్