
కార్బన్ ఉద్గారాలను 30 నుంచి 35 శాతం తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పండిట్ దీన్‌దయాల్ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
“ఈ రోజున మన దేశం కార్బన్ ఉద్గారాలను 30-35 శాతం తగ్గించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ విషయాన్ని నేను ప్రపంచానికి చెప్పినప్పుడు, ఈ లక్ష్యాన్ని భారత్ గనుక సాధిస్తే అది అద్భుతం, ఆశ్చర్యం అవుతుందని పేర్కొంది” అని పేర్కొన్నారు.
ఈ దశాబ్ధంలో నేచురల్ గ్యాస్ సామర్ధ్య వినియోగాన్ని నాలుగింతలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లుప్రధాని తెలిపారు. రానున్న ఐదేళ్లలో చమురు శుద్ధి సామర్ధ్యాన్ని కూడా రెట్టింపు చేసేందుకు పనిచేస్తున్నట్లు వెల్లడించాయిరు.
ఎనర్జీ రంగంలో స్టార్టప్‌లను బలోపేతం చేసేందుకు స్థిరమైన చర్చలు కొనసాగుతున్నాయని, అందుకు ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేశామని ప్రధాని తెలిపారు.
‘మీ దగ్గరున్న ఏదైనా ఆలోచన, ప్రోడక్ట్‌ను లేదా కాన్సెప్ట్‌ను అమలు చేయాలనుకుంటే.. ఈ ఫండ్ మీకు మంచి అవకాశం ఇస్తుంది. ఇది ప్రభుత్వం నుంచి ఒక బహుమతి వంటిదని’ మోడీ విద్యార్థులనుద్దేశించి పేర్కొన్నారు.
వచ్చే దశాబ్దంలో ఒక్క ఆయిల్, గ్యాస్ రంగంలోనే కోట్లాది రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయని, రాబోవు కాలంలో ఈ రంగం అనేక అవకాశాలను నెలవు కానుందని తెలిపారు.
More Stories
దంతెవాడలో లొంగిపోయిన 71 మంది మావోయిస్టులు
పహల్గామ్ ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి అరెస్ట్
ఇంధన ఎనర్జీ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు