నీతిమాలిన ప్రతిపక్షాలను తిరస్కరించిన ఓటర్లు 

హర్దీప్ సింగ్ పూరి,

కేంద్ర మంత్రి

తప్పుడు సమాచారం, పూర్తిగా అబద్ధాలు, నకిలీ -తప్పుడు కథనాలకు ప్రధానమైన ఆహారాన్ని ఏర్పరుస్తాయి. ఇవి మన రాజకీయ పార్టీలలో కొన్నింటికి ప్రధానమైన ఆయుధాలుగా  మారాయి. లేకపోతే జాతీయ ప్రయోజనాల  విషయంలో దివాలాకోరు తనం ప్రదర్షింపలేరు. “ఒక అబద్దం ప్రపంచ వ్యాప్తంగా సగం దూరం ప్రయాణం చేస్తుంది, నిజం నెమ్మదిగా ప్రయాణిస్తుంది” అన్నట్లుగా దురదృష్టవశాత్తు మన మేధావులలో, మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి కధానాలనే ఎన్నుకొంటున్నారు.

అదుష్టవశాత్తు చివరికి నిజమే విజయం సాధిస్తుంది. అయినా ఎందుకని  మీడియాలో ఒక వర్గం ఇటువంటి కథనాలను అనుసరిస్తుంది? ఎన్నికల ఫలితాలు ఊహించేవారు ఎందుకు పొరపాటుకు గురవుతున్నారు? నిశ్శబ్ద మెజారిటీ అభివృద్ధి-ఆధారిత పాలనను ఇష్టపడుతుందనే దానికి బీహార్ ఎన్నికలు ఫలితాలే నిదర్శనం. 15 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వారి అచంచలమైన నమ్మకానికి  ఈ ఫలితాలు నిదర్శనం.

పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) సాధించిన విజయం కూడా ప్రధాని పట్ల ప్రజల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తుంది.పాకిస్తాన్ లోని ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) కు చెందిన  సర్దార్ అయాజ్ సాదిక్ ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాకు  ఎలా చెమటలు పట్టించారో గుర్తు చేశారు.

ఆ దేశ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేని ఉద్దేశించి ఒక సమావేశంలో మాట్లాడుతూ, భారత ఎయిర్ ఉంటే ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను విడుదల చేయని పక్షంలో భారతదేశం పాకిస్తాన్ పై “రాత్రి 9 గంటలకు” దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది భారత ప్రతిపక్షంలో చాలా మంది నాయకులు సృష్టించిన తప్పుడు కథనాన్ని నాశనం చేసింది. కొంతమంది రాజకీయ నాయకులు మన సేనల మెరుపు దాడులను ప్రశ్నించారు. ఓట్లు గెలవడానికి భారత ప్రభుత్వం సృష్టించిన ఒక కుట్ర అంటూ వాపోయారు.

వారు మన సాయుధ దళాల శౌర్యం, వృత్తి నైపుణ్యాన్ని ప్రశ్నించారు. తీవ్ర సంక్షోభ సమయాల్లో కేంద్ర ప్రభుత్వం  ఉద్దేశాలు, విజయాలపై దురుద్దేశ్యాలను అంటగట్టారు. అయితే  ప్రజలు వారి రాజకీయాలను తిరస్కరించారు. పైగా వారిని శిక్షించారు. భారతీయ ప్రజాస్వామ్యం “ఖాళీ చేయబడిందని” ఓ ప్రతిపక్ష పార్టీ నాయకుడు చేసిన ఆరోపణ, ఎటువంటి జవాబుదారీతనం లేకుండా దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన ఒక బృందం అనుభవించిన లోతైన అభద్రత, నిరాశలను ప్రతిబింబిస్తుంది.

ఈ పార్టీ 2014, 2019 లలో జరిగిన రెండు లోక్ సభ ఎన్నికలలో మూడంకెల సంఖ్యను కూడా తాకలేక పోయినప్పటికీ, జాతీయంగా విభజనకు దారితీసే అన్ని కథనాలను సృష్టిస్తుంది.  2014 కి ముందు, న్యూఢిల్లీ “కుటుంబ సంబంధాలు”, పవర్ బ్రోకర్లు, దళారుల సంస్కృతికి నిలయంగా ఉంటూ వచ్చింది. వారి ఏలుబడిలో  సీనియర్ రాజకీయ నాయకులు సహితం తమ స్వతంత్ర విశ్వాసాలను అపరాధ భావంతో వదులుకొంటూ  వచ్చారు.

జాతీయ సలహా మండలి అని పిలవబడే “కార్యకర్తల” రాజ్యాంగేతర  సంస్థకు లోబడి, ప్రధాన మంత్రి  కార్యాలయంతో సహా సంస్థలు తరచుగా రబ్బరు స్టాంప్‌ స్థాయికి కుదింపు బడ్డాయి. విదేశాల నుండి చట్టవిరుద్ధంగా నిధులు అందుకొంటున్న ఉద్యమకారులలో  కొంతమంది ఎంపిక చేసిన ఆగ్రహం అర్థం చేసుకోవడం కష్టం కాదు. వారి స్వార్ధ  ప్రయోజనాలు పౌర సమాజం లేదా భారతీయ ప్రజల చట్టబద్ధమైన ప్రయోజనాలతో కలవరపడకూడదు.

కానీ ఈ స్వార్థ ప్రయోజనాలపై చట్టపరమైన చర్యలను పౌర స్వేచ్ఛపై దాడిగా చిత్రీకరించడం, ప్రత్యేకంగా పౌర స్వేచ్ఛను నిలిపివేసిన గొప్ప చరిత్ర కలిగిన పార్టీ నుండి రావడం దారుణం.  1975 లో అత్యవసర పరిస్థితి విధించిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను తాము అధికారంలో ఉన్నప్పుడు 75 సార్లు తొలగించారు. పైగా తాము అధికారంలో ఉన్నప్పుడు సుప్రీం కోర్ట్ ఒక సారి సిబిఐని “పంజరంలో చిలుక” అంటూ అభివర్ణించిన విధంగా నేర దర్యాప్తు సంస్థలను రాజకీయం కావించారు.

నేటికీ, మహారాష్ట్రలో వారి పాలన సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం  పత్రికా , భావప్రకటన స్వేచ్ఛలపై దాడి చేయడంలో ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగ పరచడంకు వెనుకాడటం లేదు.

2014 నుండి ప్రభుత్వంలో ప్రధాని పని సంస్కృతిని అవినీతిపట్ల సున్నా సహనంతో, గణనీయంగా మార్చారు. ఆలస్యం, బ్యూరోక్రాటిక్ జడత్వాన్ని తగ్గించారు.  ధైర్యాన్ని, యథాతథ స్థితి పట్ల ఆయన అసహనాన్ని భారతీయ ప్రజాస్వామ్యంపై దాడిగా చూపించడం అసహనం, నిజాయతి లోపించడానికి నిదర్శనంగానే భావించాలి.

తమ సొంత ఎన్నికల మ్యానిఫెస్టోలలో భాగమైన దీర్ఘకాలిక సంస్కరణలను మాత్రమే అమలు చేసిన వ్యవసాయ బిల్లుల విషయంలో, ప్రతిపక్షాలు భయం, పుకార్లను   వ్యాప్తి చేయడం ద్వారా రైతులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాయి. వారి 107 మంది సభ్యులలో 33 మంది ఎగువ సభలో బిల్లులపై చర్చలు జరుగుతున్నప్పుడు, ఓటు వేసినప్పుడు లేకపోవడం గమనార్హం.

కనీస మద్దతు ధరల సేకరణను నిలిపి వేస్తున్నట్లు వారు ప్రచారం చేశారు. కానీ  వాస్తవానికి, వరి సేకరణ జాతీయ స్థాయిలో గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతంకు పైగా పెరిగింది. రూ 83,8000 కోట్లకు పైగా నగదు ఇప్పటికే మన రైతులకు బదిలీ చేయడం జరిగింది. పంజాబ్ విషయంలో, సేకరణ గత సంవత్సరం కన్నా 26 శాతంకు పైగా పెరిగింది; మేము ఇప్పటికే ఈ సంవత్సరం లక్ష్యాన్ని 8% అధిగమించాము; రైతులకు, రూ 29,000 కోట్లకు పైగా చెల్లించాము.

చైనా విషయంలో,  భారతదేశం విధానంపై సంబంధించి వారు ఆ దేశానికి లొంగిపోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే లొంగిపోతున్నట్లు అబద్ధాలు చెబుతున్నారు. వ్యవసాయ బిల్లు అయినా, వస్తు, సేవల పన్ను అయినా, పౌరసత్వం (సవరణ) చట్టం, 2019 అయినా….  ఈ చర్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే ప్రారంభమయ్యాయి.

అయితే సవాళ్లతో కూడిన ఆయా సంస్కరణలను అమలు చేయగల ధృడ సంకల్పం వారిలో లోపించింది.  నిజమైన సమస్యలపై చర్చించడం కాకుండా, ప్రధాని మోదీ  పట్ల హద్దులేని ద్వేషం విరజిమ్మడం కాంగ్రెస్ రాజకీయాలకు మూలస్తంభంగా కనిపిస్తున్నది.

తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం, సమాజంలోని వివిధ వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగా భావించే మానసిక స్థితి నుండి ప్రతిపక్షాలు బయట పడాలి. మతం, కులం, ప్రాంతం  లేదా లింగంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు దేశం యొక్క పురోగతిలో సమాన భాగస్వామిగా ఉన్న యుగానికి చేరుకున్నామని గ్రహించాలి.

ధృడమైన,  శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి కూడా ప్రతిపక్షం అవసరం. అయితే నిజాయతితో వ్యవహరించాలి.  ప్రతిపక్షాలు అందుకు సిద్దపడడానికి కొంచెం సమయం పట్టవచ్చు.