
గుంటూరు జిల్లా పొన్నూరులోని శ్రీ సాక్షి భావనారాయణ దేవాలయ భూములను ఆటోనగర్ నిర్మాణం కోసం ఇచ్చే ప్రతిపాదన పట్ల బిజెపి పట్టణ శాఖ తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసింది. ఈ ఆలయ ఆస్తులపై వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని పట్టణ బిజెపి నేతలు ఆరోపించారు.
ప్రభుత్వానికి హిందూ ఆలయాల ఆస్తులపైన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇతర మతాల విషయంలో కూడా చేయగలరా..? అంటూ ప్రశ్నించారు. హిందు దేవాలయాలు అన్నిటిని రాజకీయ పార్టీ కార్యాలయాలుగా మారుస్తారా..? అంటూ బిజెపి నేతలు నిలదీశారు.
దాతలు స్వామి వారి ఆలయ అభివృద్ధి, స్వామివారి నిత్య కైంకర్యం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం దానం ఇచ్చారని వారన్నారు. ఈ వ్యవసాయ భూములను నమ్ముకొని తరతరాలుగా రైతులు, రైతు కుటుంబాలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని వారు తెలిపారు.
ఈ పంట భూములను వ్యవసాయేతర కార్యకలాపాలకు ఉపయోగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. హిందు దేవాలయాల ఆస్తుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా..? అంటూ నిలదీశారు.
గత ప్రభుత్వంలో దేవాలయ భూములు అన్యాక్రాంతం అయినవి అని చెప్పిన మీరు దమ్ము ధైర్యం ఉంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గలోని దేవాలయల భూములు అన్యాక్రాంతం అయితే విచారణ జరపక కుండా స్వాహా చేయటానికి బయలుదేరారని అధికార పక్షం నేతలపై మండిపడ్డారు. వైసీపీ,టీడీపీ రెండు తోడు దొంగలే,కవల పిల్లలే.అనేది ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు.
పొన్నూరులో ఆటోనగర్ నిర్మించాలిసిందే దేవాలయ భూములు కాకుండా ప్రభుత్వమే భూములు కొని నిర్మించాలని డిమాండ్ చేశారు.దేవాలయ భూముల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ఈ విషయమై దేవస్థాన ఈఓకు మెమోరాండం ఇవ్వడానికి వెళ్లగా వారు అందుబాటులో లేరు. క్రింది స్థాయి ఉద్యోగులు ఎవరు తీసుకొనడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
బిజెపి పట్టణ అధ్యక్షులు మొగలి పువ్వు సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు చిలకపాటి లక్ష్మణ రామాచార్యులు, కలపాల శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు