
పాకిస్థాన్ ప్రజల కష్టాలు తీరాలంటే ఇమ్రాన్ నకలీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిందే అని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్ పార్టీ (పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మర్యం నవాజ్ స్పష్టం చేశారు. దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తే గౌరవప్రదమైన వారు ఎన్నుకోబడతారని తెలిపారు.
ఈశాన్య పాకిస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ పనికి మాలిన వ్యక్తి అని, దేశంలో ఏం జరుతుతుందో ఆయనకు కనీస అవగాహన కూడా లేదని ధ్వజమెత్తారు. ప్రధాని మాటను ఏ ఒక్కరూ పట్టించుకునే స్థితిలో లేరని అందుకే ఆయన తన అధికార నివాసంలో ప్రశాంతంగా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు.
తన భర్త సఫ్దార్ను అరెస్టు చేశారని, సింద్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీపీ) అపహరణకు గురయ్యారని ఇదంతా ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తెలియకుండానే జరిగిందా.! అని ఆమె ప్రశ్నించారు. జైలులో ఉన్న సమయంలో తన బ్యారక్ బాత్రూంలో కెమెరాలను ఏర్పాటు చేశారని ఆరోపించారు.
ఓ మాజీ ప్రధాని కుమార్తెనే సురక్షితంగా లేకపోతే ఇక పాకిస్తాన్‌లోని సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఇటీవల మరియంతోపాటు ఆమె భర్త కెప్టెన్ సఫ్దర్‌ను అక్టోబర్ 19 న సైన్యం, ఐఎస్ఐ అధికారులు బలవంతంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. శుక్రవారం ఆమె విడుదలయ్యారు.
జైలులో తనను అక్కడి అధికారులు తీవ్రంగా వేధించారని, తానుంటున్న బ్యారక్ బాత్రూంలో కెమెరాలు పెట్టారని ఆరోపించారు. ఇది స్త్రీలను అవమానించడమే మండిపెట్టారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు, ఎంపీ కూడా అయిన తన పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించడం సహించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఇటీవల ప్రభుత్వం నన్ను రెండుసార్లు జైలుకు పంపింది. నేను అక్కడి పరిస్థితి గురించి మాట్లాడితే వింతగా అనిపిస్తుంది. స్త్రీల పట్ల ఇలాగానే ప్రవర్తించడం? నేను నిజం చెబితే.. ప్రభుత్వం, పరిపాలనాధికారులు వారి ముఖం కూడా చూపించలేరు’ అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పాకిస్తాన్ మహిళలకు రక్షణ లేదని తెలుస్తున్నది. ఇక్కడి మహిళలు బలహీనంగా లేరని ఇమ్రాన్‌ఖాన్ గుర్తుంచుకోవాలని ఆమె హెచ్చరించారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం