బిహార్‌ బీజేపీ శాసనసభ నాయకుడిగా తారాకిశోర్‌ ప్రసాద్‌

బిహార్‌ బీజేపీ శాసనసభ నాయకుడిగా తారాకిశోర్‌ ప్రసాద్‌
 
బీజేపీ శాసనసభా పక్ష నేతగా తారాకిశోర్‌ ప్రసాద్‌ ఎన్నికైన విషయాన్ని సుశీల్ మోదీ ఓ ట్వీట్‌లో అందరితో పంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీశ్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీలో శాసనసభ పార్టీ నేతగా సుశీల్‌కుమార్‌ మోదీ కొనసాగారు. ఈ సందర్భంగా కిశోర్‌ ప్రసాద్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 
 
పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని పేర్కొన్నారు. ’40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో బీజేపీ, సంఘ్ పరివార్ నాకు చాలానే ఇచ్చింది. పార్టీ నాకు ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తాను. పార్టీ కార్యకర్తగా నా పదవిని మాత్రం ఎవరూ ఊడలాక్కోలేరు’ అని సుశీల్ మోదీ ఆ ట్వీట్‌లో తెలిపారు.
అలాగే పార్టీ ఉప నాయకుడిగా ఎన్నికైన బెట్టియా ఎమ్మెల్యే రేణుదేవిని కూడా ఆయన అభినందించారు. రేణుదేవి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక ట్వీట్ లో పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన ప్రసాద్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.