
కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో తన కుమారుడు బినీష్ కొడియేరిని అరెస్టు చేసి జైలుకు పంపిన కొద్ది గంటల్లోనే ఆయన తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో తాత్కాలికంగా పార్టీ కార్యదర్శి పదవిని సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ కన్వీనర్ ఎ.విజయరాఘవన్కు అప్పగించారు.
కాగా, ఆరోగ్య కారణాలు, వైద్య చికిత్స కారణంలో సెలవు మంజూరు చేయాలని బాలకృష్ణన్ అభ్యర్థన చేసుకున్నారని, దీంతో ఆయనకు పార్టీ బాధ్యతల నుంచి రాష్ట్ర సెక్రటేరియట్ నిర్ణయించి, సెలవు ఇచ్చినట్టు సీపీఎం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఎన్ని రోజులు సెలవు ఇచ్చారనేది ఆ ప్రకటనలో తెలియ చేయలేదు.
పార్టీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తర్వాత రెండో స్థానంలో ఉన్న బాలకృష్ణన్కు గత ఏడాది పాంక్రియాటిక్ కేన్సర్ అని నిర్ధారణ కావడంలో అమెరికాలో చికిత్స తీసుకోవాలని అనుకుంటున్నారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావిస్తున్న 1200 స్థానిక సంస్థలకు డిసెంబర్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బాలకృష్ణన్ తన పదవి నుంచి తప్పుకోవడం పార్టీకి ఇబ్బందికర పరిణామంగా చెబుతున్నారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు