
నోట్ల రద్దు వల్ల పన్ను చెల్లింపులు బాగా పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తెలిపారు. నోట్ల రద్దు జరిగి నాలుగేళ్లు అయిన సందర్భంగా నిర్మలా సీతారామన్ పలు ట్వీట్లు చేశారు.
‘అవినీతి రహిత భారత్‌ను నిర్మించే దిశగా మోదీ సర్కార్ నాలుగేళ్ల కిందట నోట్ల రద్దును చేపట్టింది. దీన్ని నల్ల ధనంపై జరిపిన దాడిగా చెప్పొచ్చు. దీని ఫలితంగా ట్యాక్స్ కలెక్షన్ బాగా పెరగడంతోపాటు పారదర్శకత వచ్చింది. ఇప్పుడు డిజిటల్ ఎకానమీ దూసుకెళ్తోంది’ అని ఆమె పేర్కొన్నారు.
నోట్ల రద్దుకు ముందు చేసిన పలు సర్వేల్లో లెక్కల్లో లేని ఆదాయం రూ.కోట్లలో పేరుకుపోయిందని ఆమె తెలిసింది. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో ఆపరేషన్ క్లీన్ మనీ చాలా సాయపడిందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
More Stories
దగ్గు మందు ‘కోల్డ్రిఫ్’ సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్
దేశంలోనే మొదటి డిజిటల్ ఎయిర్పోర్ట్ నవీ ముంబై
ఈపీఎస్ కనీస పెన్షన్ రూ. 2,500కు పెంపు?