గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో నిత్యం 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతన్నాయి. అయితే ఈ మహమ్మారి ప్రభావంతో మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతం గంభీర్ ఐసోలేషన్లోకి వెళ్లారు.
తన నివాసంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొవిడ్ టెస్టులకు తన నమూనాలను పంపించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, ఎవరూ కూడా తేలికగా తీసుకోవద్దని గంభీర్ విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉంటే దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతి రోజు 6 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ కొవిడ్ నిబంధనలు పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.

More Stories
ఐప్యాక్ ఆఫీసుల్లో ఈడీ దాడుల సమయంలో మమతా ప్రత్యక్షం
ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత
28 నుంచే పార్లమెంట్… ఆదివారమే కేంద్ర బడ్జెట్