
ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌పై మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ విచారణ చేపట్టింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై మద్రాస్ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.
గ్యాంబ్లింగ్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సినీ ప్రముఖులు రానా, తమన్నా, ప్రకాశ్ రాజ్, సుదీప్ ఖాన్ తదితరులకు మదురై బెంచ్ మంగళవారం నోటీసులు జారీ చేసింది.
ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌కు మద్దతుగా ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలకు నోటీసులు జారీచేస్తూ ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
జస్టిస్ ఎన్ కిరుబకరన్, బి పుగలేంధిలతో కూడిన ధర్మాసనం ప్రముఖులతో పాటు ఇలాంటి ఇతర యాప్‌లకు నోటీసులు పంపింది. ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌లో లక్షలాది మంది డబ్బులు పొగొట్టుకుంటున్నారని పిటిషినర్ కోర్టుకు తెలిపాడు. గ్యాంబ్లింగ్‌కు బానిసలుగా మారడం సమాజానికి అత్యంత ప్రమాదకరమని, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు