
దుబ్బాక ఉప ఎన్నికలో కమలం-కారు మధ్య నోట్ల కట్లల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఇరుపార్టీలు ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచారం హీటెక్కించాయి.
మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని సీఈసీ నియమించింది.
నోట్ల కట్టల కలకలంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడుకు చెందిన సీనియర్ ఐపీఎస్ సరోజ్ కుమార్ను నియమించింది. మొత్తం వ్యవహారాన్ని స్పెషల్ ఆఫీసర్ సమీక్ష చేయనున్నారు.
More Stories
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే
పొంగులేటి ఒంటెత్తు పోకడలపైమహిళా మంత్రుల అసహనం